బీజేపీ సర్కార్ పై పోరుకు కాంగ్రెస్ సిద్ధమైంది. రాబోయే రెండేళ్లలో కార్యాచరణ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేసింది. మొన్నటి చింతన్ శిబిర్ పై అనేక రకాల విమర్శలు ఎదురవడంతో ఇలాగే కొనసాగితే పార్టీకి మరింత నష్టం జరగక తప్పదని భావించిన అధ్యక్షురాలు సోనియాగాంధీ.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ వ్యవహారాల కమిటీ, 2024 టాస్క్ ఫోర్స్ టీమ్ ను ప్రకటించారు.
ఇటు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్ జోడే పాదయాత్ర కమిటీని కూడా అనౌన్స్ చేశారు సోనియా. పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. అందుకే అనుభవజ్ఞులైన టీమ్ తో కమిటీని ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్యను హైలెట్ చేస్తూ రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. దీనికి సంబంధించి మొన్నటి చింతన్ శిబిర్ లో ప్రతిపాదనలకు ఆమోదం లభించగా.. తాజాగా కమిటీని ప్రకటించారు సోనియాగాంధీ.
భారత్ జోడో టీమ్
– దిగ్విజయ్ సింగ్
– సచిన్ పైలట్
– శశి థరూర్
– రవ్ నీత్ సింగ్ బిట్టూ
– కేజే జార్జ్
– ప్రద్యుత్
– జీతూ పట్వారీ
– సలీమ్ అహ్మద్
2024-టాస్క్ ఫోర్స్ టీమ్
– చిదంబరం
– ముకుల్ వాస్నిక్
– జయరాం రమేశ్
– కేసీ వేణుగోపాల్
– అజయ్ మాకెన్
– ప్రియాంక గాంధీ
– రణదీప్ సూర్జేవాలా
– సునీల్ కనుగోలు
రాజకీయ వ్యవహారాల కమిటీ
– రాహుల్ గాంధీ
– మల్లికార్జున ఖర్గే
– గులాంనబీ ఆజాద్
– అంబికా సోనీ
– దిగ్విజయ్ సింగ్
– ఆనంద్ శర్మ
– కేసీ వేణుగోపాల్
– జితేంద్ర సింగ్