ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో మంటలు చెలరేగుతున్న ఘటనలు ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు మొదటి సారిగా ఎలక్ట్రిక్ కార్లలో మంటలు చెలరేగడం ఆందోళనను కలిగిస్తోంది.
తాజాగా ముంబైలో టాటా నెక్సాన్ ఈవీలో మంటలు చెలరేగాయి. దీంతో ఘటనపై విచారణకు టాటా అధికారులు ఆదేశించారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు స్పష్టంగా తెలియలేదు.
ఈ నాలుగేండ్లలో తాము సుమారు 30,000 ఈవీలను విక్రయించినట్టు కంపెనీ వెల్లడించింది. ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి అని కంపెనీ పేర్కొంది. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు వివరించింది.
తాము వినియోగదారుల భద్రతకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ ఘటనకు కారణాలు తెలియగానే ఆ వివరాలు వెల్లడిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.