నష్టాల్లో కురుకపోయిన ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ ముందుకొస్తుంది. ఈవోఐ బిడ్డింగ్ సోమవారం సాయంత్రం 5గంటలకు ముగియనుండగా… ఈలోపు బిడ్డింగ్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. టాటాలు కంపెనీ కొంటారన్న వార్తలపై ఎయిర్ ఇండియా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టాటాలకు ఎయిర్ ఏషియాలో ఇప్పటికే వాటాలుండగా… ఎయిర్ ఇండియా కొనేందుకు ఆసక్తికనపర్చుతున్నారు. అయితే, ఇందుకోసం ఇతర కంపెనీలెవరిని భాగస్వామిగా చేసుకునే ఆలోచనలేవి కనపడటం లేదని… సొంతగానే ఎయిర్ ఇండియా కొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియాలో ఉన్న 500మంది ఉద్యోగులు సైతం ఆసక్తిగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
ఎయిర్ ఇండియాకు మార్చి 31,2019 నాటికే 58,351.93కోట్ల అప్పులుండగా… కేంద్ర ప్రభుత్వం మొత్తం వాటాను అమ్మేందుకు మొగ్గుచూపుతుంది.