టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా సైరస్ మిస్త్రీని తిరిగి నియమిస్తూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎన్.సి.ఎల్.ఎ.టి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ టాటా సన్స్ సుప్రీంకోర్టును ఆదేశించడంతో కోర్టు స్టే ఉత్తర్వులిచ్చింది. సైరస్ మిస్త్రీని తిరిగి నియమిస్తూ ట్రిబ్యునల్ ఉత్తర్వులివ్వడం న్యాయపరమైన తప్పిదమై ఉండొచ్చని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే అన్నారు.
మూడు సంవత్సరాలుగా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మిస్త్రీని నాటకీయ పరిణామంలో తొలగించారు. మిస్త్రీని తొలగిస్తూ టాటా బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో మిస్త్రీ ఎన్.సి.ఎల్.ఎ.టి ని ఆశ్రయించారు. దీంతో అతన్ని తిరిగి నియమిస్తూ డిసెంబర్ 18న ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతకు ముందు మిస్త్రీ స్థానంలో నియమించిన చంద్రశేఖర్ నియమాకం చెల్లదని ట్రిబ్యునల్ తెలిపింది.