ఎయిరిండియా పూర్తిగా టాటా చేతికి వచ్చేసింది. అన్ని లాంఛనాలను పూర్తి చేసి కేంద్రం అప్పగించింది. రూ.18వేల కోట్లు చెల్లించి ఎయిరిండియాలో 100 శాతం వాటాలను టాటా కొనుగోలు చేసింది. శుక్రవారం నుంచి టాటా ఆధ్వర్యంలో సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలి విమానం కరాచీ నుండి ముంబైకి రానుంది.
69 ఏళ్ల తర్వాత అధికారికంగా టాటాకు ఎయిరిండియా దక్కింది. ఈ మేరకు అఫీషియల్ ప్రాసెస్ పూర్తయింది. కంపెనీ షేర్లను తలాస్ ప్రైవేట్ లిమిటెడ్ కు బదిలీ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో టాటా కంపెనీ సంతోషంలో మునిగిపోయింది. తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఆసక్తికర ట్వీట్ చేసింది. దాన్నిబట్టి ఎయిరిండియా అంటే ఆ సంస్థకు ఎంతటి మమకారమో అర్థం అవుతోంది.
Your arrival was much awaited, @airindiain. #AirIndiaOnBoard #ThisIsTata pic.twitter.com/OVJiI1eohU
— Tata Group (@TataCompanies) January 27, 2022
ఎయిరిండియా కోసం చాన్నాళ్లుగా ఆతృతగా ఎదురు చూశామని.. వెల్కమ్ బ్యాక్ అంటూ టాటా గ్రూప్ ట్వీట్ చేసింది. ఎయిరిండియాను ప్రపంచ స్థాయి ఎయిర్ లైన్ గా మార్చేందుకు అవసరమైన ప్రతి ఒక్కరితో కలసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అటు ప్రధాని మోడీ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సమావేశమయ్యారు.
1953లో జాతీయికరణలో భాగంగా టాటా ఎయిర్ సర్వీసెస్ ను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో అది కాస్తా ఎయిరిండియాగా మారింది. విమానయాన రంగంలోకి ప్రైవేట్ సంస్థలను అనుమతించాక నష్టాల బాట పట్టింది. 2007-08లో ఇండియన్ ఎయిర్ లైన్స్ తో విలీనం అనంతరం నష్టాలు ఎక్కువయ్యాయి. ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను విక్రయించేందుకు ప్రభుత్వం బిడ్డింగ్ నిర్వహించింది. అందులో టాటా సంస్థ దక్కించుకుంది.