‘టాక్సీ‌వాలా’ ఎక్స్‌పోజింగ్

యూత్ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫిల్మ్ టాక్సీవాలా. షూటింగ్ ఫినిష్ కావడంతో పోస్ట్‌‌ప్రొడ‌క్షన్ పనులు శరవేగంగా జ‌రుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టీజర్‌ని ఈనెల 17న విడుదల చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. విజయ్‌తో ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ రొమాన్స్ చేయనున్నారు.

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగానే వున్నాయి. అన్నివర్గాలను ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేలా టాక్సీవాలాలో విజయ్ కనిపించనున్నాడు. మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయమని చెబుతోంది యూనిట్. ఇక మే 18న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. జీఏ 2- యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ డైరెక్టర్.