అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలు టీడీపీకి అధికారం ఇచ్చారు. 2014-2019 టీడీపీ పాలనలో ఏపీకి సువర్ణ అధ్యాయం. ఆదాయం, రాజధాని లేకపోయినప్పటికీ.. ఆలోచనతో సంక్షేమాన్ని, అభివృద్దిని సమాంతరంగా అన్ని జిల్లాలకు ఇచ్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది. ఆ విషయాన్ని తాము ప్రజానీకానికి చెప్పుకోలేకపోయాం. అదే సమయంలో వైసీపీ పేటీఎం బ్యాబ్ ప్రజలను తప్పుదోవ పట్టించింది.
మూడు రాజధానులపై ప్రైవేట్ బిల్లు పెట్టిన పార్టీ.. ప్రజలను మభ్యపెట్టి విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నం చేయడం దారుణం. ధర్మాన ప్రసాదరావుకి విశాఖ రాజధాని మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది. భూములు కాజేసిన చరిత్ర ఆయనది. అమరావతి రైతులు ఎలా వస్తారని బొత్స, తమ్మినేని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మీ జాగీరా? రాజధాని లేకపోయినా విశాఖ అభివృద్ధి జరుగుతుంది. దేశంలో ఇప్పటికే అగ్రశ్రేణి పది నగరాల్లో ఒకటిగా విశాఖ ఉంది.
మూడు ముక్కలాడితే అభివృద్ధి జరగదు. విశాఖలో మొత్తం దోపిడీ జరుగుతోంది. ప్రజలు తిరగబడకపోతే రేపు ఇళ్లలోంచి బయటకు తీసుకువచ్చి ఆక్రమించే పని జరిగినా అశ్చర్యపోనవసరం లేదు. తాను ఉత్తరాంధ్ర ద్రోహి అనే దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని.. తెలుగుదేశం, అచ్చెన్నాయుడుది ఒకటే మాట. అమరావతి రాజధాని, ప్రత్యేక హోదా గురించి జగన్ ఎప్పుడైనా మట్లాడాడా?
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ సర్వే చేసిన సరే టీడీపీకి 150 సీట్లు వస్తాయని చెబుతున్నారు. దీంతో పరిస్థితి చేజారిపోయిందని భావించిన జగన్.. ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడానికే మూడు రాజధానుల పేరుతో డ్రామాలు మొదలుపెట్టారు. పరిపాలన వికేంద్రీకరణకు ఆరాధ్యుడు ఎన్టీఆర్. తర్వాత ప్రజల వద్దకు పాలన, జన్మభూమి పేరుతో ప్రజలకు అందుబాటులో చేసింది చంద్రబాబు. జగన్ చేసేది విధ్వంసం. ఏపీ ఒకటే రాజధాని అనేది.. తెలుగుదేశం పార్టీ నినాదం.
దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీలో ప్రధానిని కలిస్తే ధైర్యంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి తాము అడిగిన విషయాలను చెబుతారు. కానీ, కేవలం తన కేసుల మాఫీ గురించే ఢిల్లీకి వెళ్లిన జగన్.. ఏం చెప్పగలరు. విశాఖ ఎప్పుడో ఆర్థిక రాజధానిగా ఉంది. సిగ్గు లేకుండా రాజీనామా డ్రామాలు ఆడుతున్నారు. వైసీపీ దొంగల నుంచి ఉత్తరాంధ్రను కాపాడుకుందాం.