అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
పెడనలో చేనేత కుటుంబం ఆత్మహత్య బాధకరం. ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు జగన్ సర్కార్ చేసిందేం లేదు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేనేతలకు ప్రోత్సాహకాలు, రుణాలు ఇచ్చాం. సొంత మగ్గం లేకున్నా రిబేటుతో సహా ఏడాదికి రూ.లక్ష సాయం అందించాం. నూలు, రంగులు ఇతర వస్తువులపై సబ్సిడీలు అందేవి. ఇప్పుడు నేతన్నలకు ఏవీ అందడం లేదు.
టీడీపీ హయాంలో ఆప్కో ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ సదుపాయం ఉండేది. ఇప్పుడు ఏ పథకాలు నేతన్నలకు చేరడం లేదు. అలాగే సబ్సీడీలు ఇవ్వడం లేదు. మార్కెటింగ్ జరగడం లేదు. చివరికి స్కూల్ యూనిఫాంను కూడా పవర్ లూంకు కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం.
అతి ప్రచారం, అసమర్ధ పాలనతోనే చేనేత కుటుంబాలు బలవుతున్నాయి. పెడన ఆత్మహత్య ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.