వంగలపూడి అనిత,
తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు.
రాష్ట్రంలో పగటిపూట కూడా అమ్మాయిలు రోడ్లపై తిరిగే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ పాలనలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మైనర్ బాలికలను సైతం వదలకుండా వాళ్ల మీద దాడులు చేయడం దుర్మార్గం. గుంటూరు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం కలచివేస్తుంది. ఈ ఘటన వెనుక జగన్ అనుచరులు ఉన్నారు.
ముఖ్యమంత్రిగా తమ అధినేత జగన్ ఉన్నారనే భరోసాతో కామాంధులకి ఉంది. అందుకే.. చిన్న పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తల్లి చనిపోయిన 14 ఏళ్ల ఆడబిడ్డను అత్యంత కిరాతకంగా వ్యభిచారం గృహానికి అమ్మేశారని ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? 2 నెలలుగా 14 ఏళ్ల బాలికపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేయడం బాధాకరం.
ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు భూ శంకర్ ఎంపీ మోపిదేవి వెంకటరమణకు ప్రధాన అనుచరుడు. సెంట్రల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం అపహరణకు గురైన ఆడపిల్లల స్థానంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. దిశ చట్టం ఏర్పాటు చేసిన రోజే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గుంటూరులో మహిళపై దాడి చేస్తే దానిని ఇప్పటి వరకు పట్టించుకున్న నాధుడే లేడు.
హోంమంత్రి సుచరితకు నిస్సహాయత శాఖ మంత్రిగా పేరు పెట్టుకుంటే మంచిది. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులే కామాంధులుగా మారిపోయారు. అంబటి రాంబాబు కామ రాంబాబు లాగా రోజుకో ఆడియో టేప్‌లతో దొరుకుతున్నా ఇప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గుంటూరు అత్యాచారం ఘటనకు సంబంధించిన దోషులను వెంటనే శిక్షించాలి.