హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని టీటీడీపీ అధికారికంగా వెల్లడించింది. టీడీపీ సీనియర్ కిరణ్మయిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ ఆమెకు బీఫామ్ అందచేశారు. ఈ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని టీటీడీపీ నిర్ణయించుకుంది. కొన్ని రోజులుగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హుజూర్‌నగర్ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. టీటీడీపీలోని సీనియర్ నేతలు, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని చివరకు కిరణ్మయిని తమ అభ్యర్థిగా ప్రకటించారు.