టీడీపీ సంస్థాగత నిర్మాణం పై అధినాయకత్వం దృష్టి పెట్టింది. ఏపీలో పలు నియోజకవర్గాలకు టీడీపీ ఇన్‌ఛార్జీలను నియమించింది. ఏలూరు టీడీపీ ఇన్‌ఛార్జిగా బడేటి రాధాకృష్ణయ్య, గుడివాడ టీడీపీ ఇన్‌ఛార్జిగా రావి వెంకటేశ్వరరావు, బాపట్ల టీడీపీ ఇన్‌ఛార్జిగా నరేంద్ర వర్మ, మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జిగా కొమ్మారెడ్డి చలమారెడ్డిలను నియమించారు.