ఏపీలో నిలిచిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిలను పూర్తి చేయాలని కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని షెడ్యూల్ ఇచ్చారు. ఈ నెల 8న ఎన్నిక, 10న ఓట్ల లెక్కింపు ఉంటుందని ప్రకటించారు.
అయితే, ఓ వైపు పార్టీలను చర్చలకు పిలిచి… ముందే షెడ్యూల్ ప్రకటించటంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో అక్రమంగా బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఫిర్యాదు చేస్తే… వాటిని పట్టించుకోలేదన్నారు. గతంలో 1శాతం లోపు ఏకగ్రీవాలుంటే… ఈసారి 19శాతం ఏకగ్రీవాలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
ఎన్నికలను బహిష్కరించాలన్నది కఠిన నిర్ణయమే అయినా… తప్పటం లేదని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగటం లేదనే ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామన్నారు.