తెలంగాణలో టీడీపీ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా రోజుల పాటు అడ్రస్ లేకుండాపోయిన ఆ పార్టీ మళ్లీ యాక్టివ్ అవుతోంది హుజూర్‌నగర్, దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో అయితే అసలు రాష్ట్రంలో టీడీపీ ఉందా లేదా అన్నట్టుగా వ్యవహరించిన ఆ పార్టీ.. ఇటీవల మళ్లీ గ్రేటర్ ఎన్నికలతో లైన్‌లోకి వచ్చింది. తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ పోటీకి సిద్ధమవుతోంది.
సాగర్‌లో టీడీపీ అభ్యర్థిగా మువ్వా అరుణ్‌కుమార్ పేరును ఖరారు చేసింది. అరుణ్‌కుమార్ న్యాయవాదిగా పనిచేశారు. నల్గొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందినవారు.ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, పార్టీ నాగార్జునసాగర్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సాగర్‌లో కాంగ్రెస్ మినహా మరే పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. కాంగ్రెస్ తరుపున జానారెడ్డి బరిలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఇంకా తేల్చుకోలేకపోతున్నాయి.