ఏపీ రాష్ట్రంలో గంజాయి కారణంగా నెలకొన్న పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 12, 13 ఏళ్ళ వయసులోని చిన్న పిల్లలు గంజాయి మత్తులో తూగుతున్నారన్న వార్తను షేర్ చేసిన చంద్రబాబు.. బెజవాడలో బాలికలు గంజాయికి అలవాటు పడ్డారన్న విషయాన్ని చూసి షాకయ్యానన్నారు. ఉదయం లేవగానే ఈ వార్త తనను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురిచేసిందని తెలిపారు చంద్రబాబు.
ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా.. ’13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెర పరిచింది. ఈ వార్త నన్ను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే… పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతుంది. తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్ గా దృష్టిపెట్టాలని’ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు.
స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతోందని ఆవేదన చెందారు. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమూలంగా గంజాయిని అరికట్టేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులకు పోలీసులను వాడడంలో మునిగిపోయిన ప్రభుత్వం యువత, విద్యార్థుల జీవితాలను గాలికి వదిలెయ్యడం క్షమించరాని నేరం అని చంద్రబాబు మండిపడ్డారు.
అంతే కాదు కొత్త సమస్యలు, సవాళ్ల నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుందని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు . ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుందని, డ్రగ్స్ కింగ్ ఎవరో అందరికీ తెలుసని సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
13 ఏళ్ల వయసున్న బాలికలు విజయవాడలో గంజాయి తాగడం నివ్వెర పరిచింది. ఈ వార్త నన్ను ఎంతో ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది. స్కూలు పిల్లల వరకు గంజాయి వచ్చేసిందంటే… పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం అవుతుంది. తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వ వ్యవస్థలు అత్యంత సీరియస్ గా దృష్టిపెట్టాలి.(1/3) pic.twitter.com/W9YavwkBxG
— N Chandrababu Naidu (@ncbn) October 3, 2022