హైదరాబాద్ : హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థి ఎవరనేది టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం ప్రకటిస్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండ జిల్లాతో టీడీపీకి అవినాభావ సంబంధం ఉందని ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తేవాలంటే హుజూర్‌నగర్‌లో పోటీ చేయాలని చంద్రబాబు చెప్పారని ఆయన తెలిపారు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. తమ అభ్యర్థి సోమవారం నామినేషన్ వేస్తారని వెల్లడించారు.
టీడీపీ టికెట్ కోసం మండవ నర్సయ్యగౌడ్, కిరణ్మయి మధ్య పోటీ వుంది. ఈ ఇద్దరిలో అధినేత ఒకరిని సెలెక్ట్ చేస్తారు. నర్సయ్యగౌడ్‌కే ఎక్కువ అవకాశం ఉందని సమాచారం.