వల్లభనేని వంశీ నిర్ణయంతో గన్నవరం రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కిపోయాయి. ఏపీ రాజకీయాలు, నేతల చూపంతా… ఇప్పుడు వంశీ నిర్ణయం మార్చుకుంటారా, తిరిగి టీడీపీలోనే కంటిన్యూ అవుతారా…? లేదా వైసీపీ గూటికి చేరుకుంటారా…? ఈ రెండు పార్టీలను పక్కనపెట్టి… సుజనా గ్రూపు ఆద్వర్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా…? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
వంశీ టీడీపీని వీడుతున్నాను అని చెప్పటంతో బుజ్జగింపులు మొదలయ్యాయి. ఇప్పటికే టీడీపీ అధిష్టానం ఎంపీ నానితో పాటు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను రంగం లోకి దింపింది. ఈ సందర్భంగా ఎంపీ నాని మాట్లాడుతూ వల్లభనేని వంశీలో ఉన్నది టీడీపీ డిఎన్ఏ అన్నారు. వంశీ లాంటి మంచి వ్యక్తిని టీడీపీ వదులుకోడానికి సిద్ధంగా లేదన్నారు. వంశీ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలని, రాజకీయాలకు దూరంగా ఉంటాము అనుకోవటం సమాజానికి మంచిదికాదన్నారు. కేసు లకు బయపడి రాజకీయాలనుంచి వెళ్ళిపోకూడదని, వంశీ తరుపున పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వంశీ చేసిన పోరాటాలు ఎప్పుడు టీడీపీ గుర్తుపెట్టుకుంటుందన్నారు ఎంపీ నాని.
ఇటీవలే వల్లభనేని వంశీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని, జగన్ ను కూడా కలవటం రాజకీయంగా దూరం లేపుతుంది. ఆయన నిజంగా రాజకీయాల నుంచి వైదొలుగుతారా, వైదొలిగితే జగన్, సుజనాలను ఎందుకు కలిశారు అని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఇదిలా ఉంటే… ఉదయం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ వంశీపై ఒంటికాలిపై లేచి… ఎందుకు తిట్టిపోశారన్నది కూడా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.