జగన్ రౌడీలను పెంచిపోషిస్తున్నాడు… దేవినేని ఉమ
ప్రధానమంత్రి మెచ్చుకున్న కొండపల్లి రిజర్వ్ దగ్గర స్థానిక శాసన సభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులు బంధువులు అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమా. గ్రావెల్ తవ్వకాలు చూడటానికి వెళ్తే తమ బృందం పై దాడికి దిగడం చూస్తుంటే జగన్ రౌడీలని పెంచి పోషించినట్లు ఉందని దేవినేని ఉమా తెలిపారు.
అక్రమాలపై ప్రశ్నించినందుకు నందిగంలో గంటా నవీన్ అనే విలేకరిని హత్య చేశారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ఇసుక అక్రమ మైనింగ్ ని అడ్డుకుంటే శిరోముండనం చేసి దళితుల్ని అవమానించారని ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టు కేసులు హత్యలు చేస్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని విమర్శించారు. రాష్ట్రంలో ఇష్టమొచ్చినట్టు ఇసుక మట్టి దోచుకుంటున్న జగన్ పరిపాలన రాక్షస పరిపాలనను పోలి ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తొలివెలుగుతో మాట్లాడిన ఆయన జగన్ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. అవేంటో తెలియాలంటే కింది వీడియో చూడాల్సిందే.