పీతల సుజాత, మాజీ మంత్రి
దళితుల పట్ల వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. గడిచిన రెండేళ్లలో అనేక మంది దళితులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేసింది. దళితుల పట్ల ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విజయవాడలో టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసుల ద్వారా అడ్డుకోవడం దుర్మార్గం. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలుగుతోంది. జగన్ రెడ్డి పాలన …కిమ్ పాలనను గుర్తుచేస్తోంది. రాజకీయ కక్షసాధింపు చర్యలతో దళితులపై దాడులకు తెగబడుతున్నారు.
కరోనా నుంచి రక్షణ కోసం మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను పిచ్చివానిగా ముద్ర వేసి వేధించి చంపేశారు. వైసీపీ నేతల అవినీతిని ప్రశ్నించినందుకు డాక్టర్ అనితా రాణి పట్ల అసభ్యంగా ప్రవర్తించి మానసిక క్షోభకు గురిచేశారు. చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ , అతని సోదురునిపై దాడులు చేశారు. ప్రశ్నించాడని ప్రకాశం జిల్లా యువకుడు కిరణ్ ను కొట్టి చంపారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దళితుల గొంతుకలను అణిచివేస్తున్నారు.
మేము ఏం తప్పు చేశామని మమ్మల్ని ఆందోళన చేయకుండా అడ్డుకుంటున్నారు. నిరసన ర్యాలీ చేసే హక్కు కూడా దళితులకు లేదా? పరామర్శించేందుకు వెళుతున్న నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన అన్యాయం, టీడీపీ హయాంలో జరిగిన న్యాయంపై చర్చకు మేము సిద్ధం. మేమూ నేటి వైసీపీ ప్రభుత్వంలా వ్యవహరించి ఉంటే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చేవారా? విజయవాడలో టీడీపీ ఎస్సీ సెల్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలి. వైసీపీ ప్రభుత్వ తీరు మారకపోతే దళితులమంతా ఏకమవుతాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతాం.