మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కారు యోచిస్తుండటంతో మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి సరికొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. అమరావతి రాజధానిగా కొనసాగించే అవకాశం లేకపోతే టెంపుల్ సిటీ అయిన తిరుపతిని రాజధానిగా ఏర్పాటు చేయూలని డిమాండ్ చేశారు. ఇది కుదరకపోతే చిత్తూరు జిల్లాను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కలపాలని డిమాండ్ చేశారు. కాగా ఏపీ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసిన తొలినాళ్లలో జగన్ ఎందుకు వ్యతిరేకించలేదని అమర్ నాథ్ రెడ్డి ప్రశ్నించారు. మూడు రాజధానుల ఏర్పాటు చేస్తే ముగ్గురు సీఎంలు ఉండాలని వ్యాఖ్యానించారు.