తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ పార్టీల్లో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది టీడీపీనే. మహా నటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావుగా 40 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే భారీ విజయం సాధించడంతో పాటు అనేక సంస్కరణలకు కేంద్రంగా మారింది. 20 ఏళ్లు అధికార, ప్రతిపక్ష పాత్రను పోషించింది. కానీ టీడీపీ ప్రస్తుతం ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి బ్యాడ్ పిరియడ్ ఫేస్ చేయలేదని టీడీపీ సీనియర్ నేతలే మదనపడుతున్నారు.
ఇక మంగళవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ భారీ వేడుకలు నిర్వహించనుంది. అయితే, వేడుకలకు సన్నాహకంగా సోమవారం హైదరాబాద్‌లో పార్టీతో తన ప్రయాణం గురించి పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు రాసిన పుస్తకాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ చెందిన పలువురు కీలక నేతలతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అలాగే, పార్టీ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ వేదిక ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నయని, అందరూ ఆహ్వానితులేనని టీడీపీ ప్రకటించింది.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ సినీ నటుడు స్వర్గీయ నందమూరి తారకరామవు ప్రజా జీవితంలోకి వచ్చారు. తెలుగు జాతి గర్వపడేలా చేస్తాను అంటూ.. తెలుగు దేశం పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. స్వర్గీయ అన్నఎన్టీఆర్ పార్టీని ప్రకటించి పూర్తిగా 40 ఏళ్లు నిండాయి. 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారకరామారావు హైదరాబాద్‌లోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీని ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ హైద్రాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో ఘనంగా వేడుకలను నిర్వహించనుంది. వేడుకలు రేపు (మార్చి 29, 2022) మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమవుతాయి
#40YearsOfTeluguDesam pic.twitter.com/FDw9gt8YiY— Telugu Desam Party (@JaiTDP) March 28, 2022
Advertisements