వంగలపూడి అనిత
టీడీపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు
తిరుపతిలో నేను మాట్లాడిన మాటల వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో జగన్ ను గద్దె దింపి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేంత వరకు మహిళలంతా కలిసికట్టుగా పని చేయాలని నేను అంటే జగన్ సీఏం అయ్యేందుకు మహిళలు పని చేయాలని అన్నట్లు వీడియో ఎడిట్ చేసి ట్రోల్ చేశారు.
అంతటితో ఆగకుండా ఈ వీడియో వైరల్ కావడంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో సంతకం కూడా ఫోర్జరీ చేసి మరో ఫేక్ నోటీస్ వాట్సాప్, ఫేస్‌బుక్ గ్రూపుల్లో పెట్టారు. ఇదే వైసీపీ ప్రభుత్వం పై సోషల్ మీడియాలో ఎవరైనా ట్రోల్స్ పెడితే తక్షణమే స్పందించే పోలీసులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు.
ఒక మాజీ ఎమ్మెల్యేని, తెలుగు మహిళా అధ్యక్షురాలిని, పొలిట్ బ్యూరో సభ్యురాలిని అయిన నన్ను అవమానించడం సరికాదు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారి పై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. ఈ విషయం గురించి ఎంత దూరమైనా వెళ్తా, విడిచిపెట్టే ప్రసక్తే లేదు.