విధి నిర్దయగా ఉంటుంది అని విజయసాయిరెడ్డి చెప్పిన మాట నూటికి నూరు శాతం నిజమన్నారు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఎన్నికల ముందు ఎంపీలను ఇవ్వండి మోదీవై మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అని మెడలు ఎగరేసిన గన్నేరుపప్పు…గెలిచిన తరువాత ఆరు నెలలు తిరగకముందే పిల్లిలా మారి కేసుల మాఫీ కోసం మోకాళ్ళు వంచి మోదీ కాళ్ళ మీద పడబోయాడు. మీ దొంగ నాటకాలు గురించి తెలిసిన మోదీ ఆ నమస్కారాన్ని తిరస్కరించారు.అన్నట్టు విధి ఆడిన మరో వింత నాటకం ఏంటి అంటే పార్టీ లో ఏ2 ని అంటూ బిల్డప్ ఇచ్చిన మిమ్మల్ని కారు లోంచి బయటకు గెంటేయడం. మీరు త్వరలో జగన్ గారు చేసిన అక్రమాలు అన్ని బయటపెడతాను అంటూ బెదిరించడమండి అంటూ చురకలు అంటించారు.