బోండా ఉమ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
వైసీపీ నాయకులు విచ్చలవిడిగా అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారు. ఇక వైసీపీ డ్రగ్స్ వ్యాపారం వల్ల ఏపీ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. డీఆర్‌ఐ అధికారులు ఆంధ్రా బోర్డర్స్ అంటే జాగ్రత్తగా ఉండాలని పక్క రాష్ట్రాలను హెచ్చరిస్తున్నారు.
వైసీపీ తప్పులను డీజీపీ కప్పిపుచ్చుతున్నారు. రూ.9 వేల కోట్ల హెరాయిన్ దొరికితే ఏమీలేదని డీజీపీ ఎలా చెబుతారు. సాక్షాత్తు డీఐజీ ర్యాంకు అధికారులే గంజాయి కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. డీఆర్‌ఐ అధికారులు వైసీపీ నాయకులను, పోలీస్ అధికారులను విచారించాలి.