బోండా ఉమా, టీడీపీ నేత
ఎక్కడ స్కాం జరిగినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయి. రాష్ట్రాన్ని వైసీపీ నేరాంధ్రప్రదేశ్ గా మార్చింది. రూ.9 వేల కోట్ల హెరాయిన్ ఇష్యూపై వైసీపీ సమాధానం చెప్పాలి. నిందితుడు సుధాకర్ వైసీపీ మద్దతుతోనే డ్రగ్స్ వ్యాపారం పెట్టాడు. ఇప్పటికే వేల కోట్ల ఎర్రచందనాన్ని వైసీపీ నేతలు విదేశాలకు అమ్ముకుంటున్నారు.
Advertisements
ఆఖరికి వేంకటేశ్వర స్వామివారికి భక్తులు ఇచ్చిన వెంట్రుకలు ఎగుమతి చేస్తూ పక్క రాష్ట్రాల్లో దొరికిపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు స్పెషల్ విమానాల్లో విదేశాలకు డబ్బు తరలిస్తున్నారు. జగన్ హయాంలో వైసీపీ నాయకులు పది తరాలకు సరిపడా సంపాదించారు.