బీజేపీ ఎంపీ జీవియల్ పై నిప్పులు చెరిగారు టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి. అసలు జీవియల్ ఎవడు.. అతనో పైరవీకారుడు అంటూ విమర్శించారు. తన ఎంపి పదవిని అడ్డం పెట్టుకుని పైరవీలతో కాంట్రాక్టులు ఇప్పిస్తూ డబ్బులు దండుకుంటాడు. ఈ జీవియల్ కు మన ఎపి గురించి ఏమి తెలుసని మండిపడ్డారు. తుగ్లక్ ఒకచోట నుంచి మరో చోటు కు రాజధానికి మార్చారు. మన పిచ్చి తుగ్లక్ మూడు రాజధానులు అంటూ ముక్కలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దు కోర్ట్ ద్వారా న్యాయం జరుగుతుందని రాజధాని రైతులకు దైర్యం చెప్పారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగితే ఎనిమిది నెలల పాలనలో మీరెందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
కరుడుగట్టిన కర్కశుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే కక్ష పూరిత పాలన చేస్తున్నాడు. మొదటి నుంచీ ఫ్యాక్షన్ సంస్కృతి లో పెరినవాడు జగన్. పోలీసు వ్యవస్థ ను కూడా పూర్తి గా భ్రష్టు పట్టించారని విమర్శించారు బుచ్చయ్య చౌదరి. చంద్రబాబు ఎన్టీఆర్ స్కూల్ పెడితే.. జగన్ బూతుల స్కూల్ పెట్టారని ఎద్దేవాచేశారు. ఈ స్కూల్ లో బొత్స, కొడాలి నాని, అనిల్ వంటి వారు నేర్చుకుంటున్నారు.అసెంబ్లీ లో మాకు మైకు ఇవ్వమంటే ఆ స్పీకర్ మమ్మలనే బయటకు పంపుతారు.అసెంబ్లీ లో మాట్లాడ నివ్వకపోతే బయట ప్రజలతో మాట్లాడుతాం. ఎంతో మంది నియంతలు కాల గర్భం లో కలిసిపోయారు. జగన్ ఎంత అని విమర్శించారు. లాలూ వంటి వారు జైలుకు వెళ్ళినప్పుడు 40వేల కోట్లు దోచుకున్న జగన్ జైలుకు వెళ్లరా అని ప్రశ్నించారు.