వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో మండిపడ్టారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గుట్కా నాని చంద్రబాబు మీద అవాకులు, చవాకులు పేలుతున్నారని, మతి భ్రమించి, పిచ్చి పట్టి మాట్లాడుతుంటే… సమాధానం ఏం చెబుతామన్నారు.
చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి కొడాలి నానికి లేదన్నారు. వైసీపీ పునాదులు కదుపుతానని ఆనాడు పలుగు పట్టుకుని వెళ్లిన కొడాలి నాని.. ఇప్పుడు ధీరుడు, శూరుడు అని మాట్లాడుతున్నారని అన్నారు. ‘ఇప్పుడు నువ్వు.. నీ జగన్ రెడ్డి , చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేరు’ అని అన్నారు. ఎన్నికలకు ముందు అప్పుల్లో ఉన్నకొడాలి నాని ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.
స్కాం లు, దాచుకోవడాలు, దోచుకోవడాలు కొడాలి నాని, జగన్ రెడ్డికి అలవాటని, నాని లాగా అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే పిల్లిలా ఉండం తమకు తెలియదని, చంద్రబాబు మీద ప్రేమ, అభిమానంతో పని చేస్తున్నామని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.
నాని పెయిడ్ ఆర్టిస్ట్ కాబట్టి… అవసరాన్ని బట్టి మాట్లాడతారని అన్నారు. ప్రభుత్వం ఉంది కదా అని ఎగిరెగిరి మాట్లాడుతున్నారని, మహిళలను కూడా తిడుతున్న కొడాలి నానిని ప్రజలు క్షమించరని అన్నారు. రేపు ఇంకో పార్టీలోకి వెళితే.. జగన్‌ను కూడా ఇలాగే తిడతారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గుట్కా నానిని పిచ్చోడిలా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. నాని లాంటి ఎంతోమంది కాల గర్భంలో కలిసి పోయారని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.