చినరాజప్ప, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
ఏపీ ఫైబర్ నెట్ అంశంలో కావాలనే టీడీపీపై బురద చల్లుతున్నారు. 24వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ లైన్ వేయాలంటే రూ.4 వేల కోట్ల మేర ఖర్చు అవుతుంది. కానీ.. టీడీపీ హయాంలో రూ.330 కోట్లకు పూర్తయింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూ.149కే ఇంటర్ నెట్, ఫోన్, టీవీ వంటి సౌకర్యాలను అందించాం. ఈ ప్రాజెక్టును ప్రధాని మోడీ కూడా అభినందించారు. అలాంటి అద్భుతమైన ప్రాజెక్టును కుట్ర పన్ని నాశనం చేశారు.
ప్రభుత్వ కుట్రలో భాగంగానే గౌరీశంకర్ ను ఎండీగా నియమిస్తూ సంబంధిత నోట్ ఫైల్ పై సీఎం స్వయంగా సంతకం చేశారు. అర్హత లేని వ్యక్తిని నియమించారంటూ ఆరోపణలు రావడంతో దిక్కుతోచక తొలగించారు. గౌరీశంకర్ నకిలీ ధృవపత్రాలపై విచారణ ఎందుకు చేయలేదు. మీకు కావాల్సిన వ్యక్తి కాబట్టే వదిలేశారా..? గౌరీశంకర్ నకీలీ సర్టిఫికెట్లపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి.