వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరునెలల్లో రంగులెయ్యటం తప్ప ఏమి సాధించలేదంటూ విమర్శించారు మాజీ మంత్రి దేవినేని ఉమ. గతంలో ఉల్లిపాయలు కొస్తుంటే కళ్ళలోంచి నీరు వచ్చేది, కానీ ఇప్పుడు జగన్ పుణ్యమా అని కొనాలంటే కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయన్నారు. దేవినేని ఉమాని దెబ్బ కొట్టాలంటే కరెన్సీ నోట్లను చించి హవాలా కార్యకలాపాలు చేయాలా అంటూ ప్రశ్నించారు. మైలవరంలోని రైతు బజార్ ,మార్కెట్ యార్డ్ లను సందర్శించిన ఉమ మీడియా తో మాట్లాడారు. మార్కెట్ యార్డ్ లో ఇసుక అమ్మకం సిగ్గుచేటని వెంటనే ప్రజలకు ఉచిత ఇసుక అందించాలని డిమాండ్ చేశారు.
డొంకతిరుగుడు సమాధానాలు మాని గత ఎన్నికలలో కరెన్సీ నోట్లను చించి మైలవరం ప్రాంతంలో పంచారో.. లేదో.. కృష్ణప్రసాద్ సమాధానం చెప్పాలన్నారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేస్తే ప్రభుత్వం మెడలు వంచైనా పేద ప్రజలకు న్యాయం చేస్తాం అని ప్రకటించారు.