టీడీపీపై ఉద్దేశ్యపూర్వకంగానే బురద జల్లుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి దేవినేని ఉమా. తెలంగాణ, ఏపీలో ఐటీ దాడుల నేపథ్యంలో టీడీపీ నేతలపై సాక్షి పత్రిక అవాస్తవాలను ప్రచారం చేస్తోందని విరుచుకుపడ్డారు. వైసీపీ పనిగట్టుకొని టీడీపీపై అప్రతిష్టపాలు చేస్తుందన్నారు. ఐటీ తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్ ను సాక్షి పత్రిక తెలుగులోకి అనువదించగలడా అంటూ సవాల్ విసిరారు దేవినేని ఉమా. ఏపీ సీఎం జగన్ కు ఏమాత్రం ధైర్యం ఉన్న పోలవరం పనులను చేస్తోన్న మెగా ఇన్ ఫ్రా, ఢిల్లీకి చెందిన షాపూర్ జీ-పల్లోంజీల, తెలంగాణ సీఎం కేసీఆర్ కు సంబంధించిన ప్రతిమ ఇన్ ఫ్రాల గురించి సాక్షి దినపత్రికలో ప్రచురించగలరా అని ప్రశ్నించారు.
ఈ పేర్లను ప్రస్తావిస్తే జగన్ తోకలు కట్ అవుతాయి.. వీపులు పగిలిపోతాయి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పేర్లను గురించి ప్రస్తావించకుండా కేవలం చంద్రబాబుపై బురద చల్లుతారా అని ప్రశ్నించారు దేవినేని.