ఏపీఐఐసీ చైర్మన్ రోజాకు రాజధాని సెగ తగిలింది. గురువారం ఉదయం నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమ్మిట్‌లో రోజా పాల్గొన్నారు. ఆ విషయం తెలిసిన రాజధాని రైతులు, మహిళలు అక్కడకు చేరుకుని సమ్మిట్ బయట ఆందోళనకు దిగారు. అమరావతికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు దివ్యవాణి మాట్లాడుతూ రాజధాని రైతులకు రోజా సమాధానం చెప్పల్సిన అవసరం ఉందన్నారు. ఒకవైపు సీఎం జగన్ దొంగదారిన వెళ్లిపోతున్నారని, ఇప్పుడు రోజా కూడా ప్రజల మధ్యలోకి రాలేక, కారు దిగకుండా దొంగదారిన వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. నవమాసాలు అంటే 9 నెలల జగన్ పాలనలో నవమోసాలు బయటకు వచ్చాయని, అందుకే ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారని దివ్యవాణి అన్నారు. రాజధాని రైతులకు అండగా టీడీపీ ఉంటుందని, రాజధాని తరలిస్తుంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని నీ అవినీతికి వాడుకోవద్దని సూచించారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » నవమాసాల్లో… నవమోసాలు