శ్లాబులు మార్చి విద్యుత్ బిల్లులు పెంచటం కంటే దుర్మార్గం మరొకటి లేదన్నారు మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమా. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకుండానే ప్రజలపై మోయలేని భారం మోపారన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లను పక్కనపెట్టాలన్నారు. ఈ సందర్బంగా అధిక బిల్లులను నిరసిస్తూ.. ప్రతులను తగలబెట్టారు.ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం రోజు రోజుకూ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
కానీ సంస్థపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖలో వందల కోట్లు రూపాయలు వసూలు చేసి చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.అనుమతులిచ్చిన అధికారులందరినీ హైపవర్ కమిటీలో వేసి ప్రజలకు ఎలాంటి సంకేతం పంపుతున్నారని ప్రశ్నించారు.