కరోనా కోరల్లో చిక్కి రాష్ట్రం మొత్తం ఇబ్బందులు పడుతుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా విద్యుత్ చార్జీలు పెంచడంతో సామాన్య ప్రజల నడ్డి విరిగినట్టుగా ఉందన్నారు కేశినేని శ్వేత. లాక్ డౌన్ కారణంగా సామాన్య జనం బిల్లు చెల్లించే స్థోమత కోల్పోయారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని 200 యూనిట్స్ లోపు ఉన్న వారందరినీ విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
రెండు నెలలు కాకుండా ఏ నెలకు ఆ నెల రీడింగ్ ఇవ్వాలని తెలిపారు. కరోనా లాక్ డౌన్ వల్ల దాదాపుగా రెండు నెలల నుండి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకొంటున్న పేద, మధ్య తరగతి ప్రజల మీద విద్యుత్ బిల్లుల భారం పడకుండా చూడాలని కోరారు. ఈ మేరకు విజయవాడ లోని ఆటోనగర్ సబ్ స్టేషన్ లోని ADE ,AE ని కలిసి వినతి పత్రం అందజేశారు.