చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేవంటూ తమ్మినేని సీతారాం పై నిప్పులు చెరిగారు టీడీపీ నేత కూన రవికుమార్. నీవు ఏ పదవిలో ఉన్న చంద్రబాబు కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు అది గుర్తుపెట్టుకుని మాట్లాడంటూ మండిపడ్డారు. అదే చంద్రబాబు దగ్గర నువ్వు పని చెయ్యలేదా అని ప్రశ్నించారు కూన రవి. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోరని హెచ్చరించాడు.
హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్లాన్ వేశారని… చంద్రబాబు బండారం బయటపెడతామని, ప్రజల ముందు నిల్చోబెట్టి గుడ్డలూడదీస్తామంటూ చంద్రబాబుపై తమ్మినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకెంతో అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోవాలంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.