ముప్పనేని శ్రీకాంత్
టీడీపీ నేత
జగనూ ఒక్కొక్కరికీ నీ పర్సనల్ అక్కౌంట్ నుంచి కోటిచ్చావా?
కోటిచ్చిన జగన్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో సొంగ కార్చుతున్న సోకాల్డ్ మేధావులారా!
ఆయన వ్యక్తిగత ఖాతా నుంచి ఈ సొమ్ము ఏమైనా ఇచ్చాడా?
జగన్‌రెడ్డికి అత్యంత ప్రియమైన సామాజికవర్గం వాడైన ఎల్‌జీ పాలిమార్స్ కంపెనీ సెక్రటరీ రవీంద్ర రెడ్డి సూరుకంటి ఖాతా నుంచి చెల్లించాడా?
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఎల్‌జీ పాలిమార్ కంపెనీ ప్రతినిదులతో ఎంత శాంతంగా మాట్లాడారో మీరు చూశారు కదా!
రసాయనిక వాయువుల్ని వదిలి మరణమృదంగం మోగించిన ఎల్‌జీ పాలిమార్స్ కంపెనీపై కనీసం చర్య తీసుకుంటామనైనా ప్రకటించారా?
బాబాయ్ చనిపోయినప్పుడు ముందుగా గుండెపోటన్నారు…ఆ తరువాత చంద్రబాబు గొడ్డలితో బాబాయ్‌ని బాత్రూమ్‌లో చంపేశారన్నారు..చివరికి సీబీఐ ఎవరో తేల్చుతామని వస్తే దర్యాప్తు వద్దే వద్దంటున్న జగన్‌రెడ్డి గా ఈ గ్యాస్ లీక్‌పై దర్యాప్తును అడ్డుకోకుండా ఉంటారా?
గ్యాస్ లీక్ ఇష్యూపై కేంద్రం స్పందించింది.. దీని తీవ్రత తగ్గించేందుకు కోటి ఉపయోగపడుతుంది.. విపక్షాలు మృతులకు పాతిక లక్షలు అడిగితే మనసున్న మారాజు మా అన్న కోటిచ్చాడంటూ చావుల మీద కూడా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు.
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పేటీఎం గ్యాంగులు విశాఖ వాసుల మృతిపై శాడిస్టిక్‌గా ఆనందం పొందుతున్నారని ఫేక్ ట్వీట్లు, సోషల్ మీడియా పోస్టులు వేసి..ఇవి కొంతమంది పేటీఎం జర్నలిస్టులకు ఇచ్చి సర్కులేట్ చేయిస్తూ..అతిపెద్ద ప్రమాదాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేశారు.
మొత్తం ఈ ఘటన వెనుక కర్త, కర్మ, క్రియ విజయసాయిరెడ్డేనని రూఢికాని రూమర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి..
ఎల్‌జీ పాలిమార్స్ కంపెనీ పరిసరాలలో కాలనీలు, ఆక్రమించి నివసిస్తున్నవారిని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.
వారు ఖాళీ చేయకపోవడంతో..విజయసాయిరెడ్డికి బంధువైన ఎల్‌జీ పాలిమార్స్ కంపెనీ సెక్రటరీతో లాలూచీ పడి ఇలా గ్యాస్ లీక్ చేయించారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇంతమంది చచ్చిపోయినా, ఆ కంపెనీపై చర్యలు తీసుకుంటామని కూడా సాక్షాత్తూ ముఖ్యమంత్రి అనకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
విశాఖకు వెళ్తూ విజయసాయిరెడ్డి కారు ఎక్కుతున్నా దింజేసి మరీ జగన్ వెళ్లిపోవడం వెనుక కూడా ఇదే కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వెంకటాపురం ఏరియాలో పదులసంఖ్యలో మనుషులు చనిపోయారు, పశువులు చనిపోయాయి, వందల మంది ఆస్పత్రుల్లో వున్నారు.
వీరిని పరామర్శించే కంటే ముందే కంపెనీ ప్రతినిదులతో ఏదో పెట్టుబడులతో వచ్చినట్టు కుశల ప్రశ్నల సమావేశం ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో నే జగన్ నిర్వహించడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి.
అలాగే ఎల్‌జీ పాలీమార్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాత కంపెనీ అని సీఎం నోటి నుంచి రావడం వెనుక మర్మమేంటో తెలియక జనాలు తలలు బాదుకుంటున్నారు.
అంతర్జాతీయ స్థాయి ఈ సంస్థ యాజమాన్యానికి పేరుప్రతిష్టలున్నాయని జగన్ ఎల్‌జీ పాలీమార్స్‌ని పొగడ్డం ఆరంభించారు.
ఎల్జీ పాలిమార్స్ పై గట్టి చర్యలు ఉంటాయని గట్టిగా చెప్పక పోగా….అతి త్వరలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని కంపెనీ నిర్వాహకుడిని తానేనన్నట్టు సీఎం ప్రకటించడం ఈ కంపెనీ వెనుకున్నది హైలీ రెస్పెక్టెడ్ వాల్లేనని అర్థం అవుతోంది.
ఏ కంపెనీ అయితే స్థానికుల్ని పొట్టనబెట్టుకుందో..వాళ్ల కుటుంబసభ్యులకు అదే కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామనే హామీ కూడా అనుమానాలు రేపుతోంది.
మరో ముఖ్య విషయం ఏంటంటే.. ప్రభుత్వం పెద్ద బంధువులకు ఉన్న పాలిమర్ కంపెనీలకు ఎల్‌జీ పాలిమార్స్ సూపర్ సప్లయర్ అని అందుకే ఈ మీనమేషాలు, నాన్చుడు ధోరణి అనే వాదనలూ వినిపిస్తున్నాయి.
జగన్ రెడ్డి చెప్పినట్టే! చనిపోయినవారూ ఎలాగూ తిరిగిరారు. కానీ చంపిన కంపెనీ మాత్రం వస్తుంది.. అక్కడే ఉండి చస్తారా? ఖాళీ చేస్తారా? ఇది అసలు ఎవరికీ అందని హెచ్చరిక. ఆ ప్రాంతీయులకు మాత్రమే అర్థమైన నర్మగర్భ హెచ్చరిక.