ముప్పనేని శ్రీకాంత్ టీడీపీ నేత
టీడీపీ నేత
ఒక్క రోజే జగన్ రెడ్డి అలియాస్ తుగ్లక్ రెడ్డి ప్రభుత్వానికి వరుసగా హై కోర్ట్ మూడు మొట్టికాయలు వేసింది.
1) డాక్టర్ సుధాకర్ గారి మీద ప్రభుత్వ దాడి కేసు ని సిబిఐ కి అప్పగించడం.
2)వైకాపా రంగుల పిచ్చి జీవో 623 ని రద్దు చేసి ప్రభుత్వాన్ని కోర్ట్ ధిక్కరణ సంజాయిషీ ఇచ్చుకోమనడం
3) మాజీ ఇంటిలిజెన్సు చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు గారి సస్పెన్షన్ ఎత్తివేత.
ఈ దెబ్బ తో చిర్రెత్తిన తుగ్లక్ రెడ్డి గారు వచ్చే సెషన్స్ లో హై కోర్ట్ రద్దు మీద బిల్ పెడ్తారు అనుకుంటా.
యధావిధిగా ఆర్థిక మంత్రి బుగ్గన గారి చేత ఆర్థిక లోటు ఉన్న రాష్టం లో హై కోర్ట్ అవసరం లేదు న్యాయ మూర్తులకి వాళ్ళ సిబ్బంది కి జీతాలు బొక్క మన ఎమ్మెల్యే లే 150 మంది ఉన్నారు. నియోజక వర్గాల వారి గా కేసు లు అన్ని వాళ్లే పర్యవేక్షిస్తారు అని బుగ్గలు నొక్కుకుంటూ అంటారు .వెంటనే అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ హై కోర్ట్ చంద్రబాబు హయం లో కట్టింది. నిబంధనలకు విరుద్దంగా కట్టారు పైగా వాస్తు కూడా బాగా లేదు దీనినే వెంటనే కూల్చివేస్తే రాష్టానికి శ్రేయస్కరం అని చెప్తారు.యధావిధి గా మన విజయసాయి రెడ్డి గారు ఈ హై కోర్ట్ లో ఉన్న బంట్రోతు దగ్గర నుండి ప్రధాన న్యాయమూర్తి దాక చంద్రబాబు కులస్థులో లేక చంద్రబాబు నియమించినోళ్లు అంటూ ట్విట్టర్ లో రెట్ట వేస్తూ ఈ నియామకాల పేపర్ ఒకటి పట్టుకొని పిఎంఓ ఆఫీస్ ముందు పడిగాపులు గస్తు వచ్చిపోయేవాళ్ళకి దండాలు పెడ్తూ ఓర్లి ఓర్లి చెప్తారు
ఇది నాలుగు రోజులు మీడియా లో గడవగానే వెంటనే మన కరకట్ట కమల్ హాసన్ ఆర్కే రెడ్డి వాళ్ళ అన్న అయోధ్య రామిరెడ్డి రాంకీ కనస్ట్రక్షన్ నుండి నాలుగు జేసీబీ లు తెప్పించి ఎర్రటి ఎండలో గొడుగు వేసుకొని అయినా సరే నిలబడి దగ్గరుండి మరి హై కోర్ట్ ని కూల్చేస్తారు. ఇంకా ఏముంది ఖేల్ ఖతం దుఖాణ్ బంద్. వీళ్ళ పిచ్చి తుగ్లక్ నిర్ణయాలకు అడ్డు చెప్పే ఈ ఒక్క అడ్డు తొలిగిపోద్ది. ఇంకా ఈ గొర్రెల మంద ఆడిందే ఆట పాడిందే పాట.