వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దిశ చట్టంను ఏర్పాటు చేశారు కానీ నాయ్యం ఎక్కడ జరుగుతుందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పంచుమర్తి అనురాధ. నెల్లూరు లో వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మహిళా ఎంపిడిఓ సరళ పై దారుణంగా దాడి చేశారు. మహిళ అని చూడకుండా ఇంటికి వెళ్లి మరీ దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన జరిగి నేటికీ 4 నెలలు అవుతుంది. దిశ చట్టం ప్రకారం 21 రోజుల్లో విచారణ పూర్తి అయ్యి నిందితుడికి శిక్ష కూడా ఖరారు కావాలి. ఒక మహిళా అధికారికి అర్ధరాత్రి పూట పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని దీక్ష చేసే పరిస్థితి తీసుకొచ్చిన వైకాపా ప్రభుత్వం ఆవిడకి దిశ చట్టం ద్వారా ఎప్పుడు న్యాయం చేతుందని ప్రశ్నించారు.