వైసీపీ ప్రభుత్వం గత నాలుగు నెలలుగా అన్ని రంగాల్లో మహిళల్ని విస్మరించిందని , వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు టీడీపీ అధికార ప్రతినిధి అనురాధ. ఇక టీడీపీ మహిళా నాయకురాళ్లపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా కుటుంబంపై కావాలనే అక్రమ కేసులు పెట్టి దాడి చేస్తున్నారని,అఖిల ప్రియ భర్త కంపెనీలో కార్మికులను కొట్టారని అక్రమ కేసులు పెట్టారన్నారు . ఒకవేళ కార్మికలను కొట్టడం నిజమైతే , కార్మికులు కేసు పెడతారు , కానీ బయటి వ్యక్తులు కేసులు పెట్టడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు . వైసీపీ నేతలే కావాలని కేసులు పెట్టించారన్నారు. అదే వైసీపీ నాయకులు, మహిళా అధికారిని బెదిరిస్తే గంటలో బెయిల్ ఇచ్చి బయటకు తీసుకొచ్చారని విమర్శించారు. మహిళా ఎంపిడిఓ సరళ కేసులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంపేస్తామని మహిళను బెదిరిస్తే ఎం చేసారని ప్రశ్నించారు.