ద్వారంపూడి తనంత నిజాయితీపరుడు లేడని అనుకుంటున్నాడని…. ఆయన నిజస్వరూపం ఏంటో నియోజకవవర్గ ప్రజలకు తెలుసని విమర్శించారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. అనపర్తి నుంచి వచ్చి కాకినాడలో దందాలు మొదలుపెట్టిన చరిత్ర నీదంటూ ఆమె నిప్పులు చెరిగారు. నీ తండ్రి భాస్కర్‌రెడ్డి అనపర్తిలో ఉన్నప్పుడు దొంగ నోట్లు ముద్రించి కాల్ మనీ ద్వారా చెలామణి చేశారని ఆరోపించారు. పేద ప్రజల పొట్టగొట్టి, రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టి విదేశాలకు తరలించిన చరిత్ర నీ తండ్రిదని ఘాటుగా విమర్శించారు.
కాకినాడలోని భానుగుడి సెంటర్‌లో మహేంద్ర స్వీట్ స్టాల్ యజమానికి కనీసం అద్దె కూడా ఇవ్వకుండా కోటి రూపాయల ఆస్తిని కాజేసిన చరిత్ర నీది… కోటి రూపాయలు ఇవ్వకపోగా 70 లక్షల రూపాయలు అతని వద్ద వసూలు చేసిన చరిత్ర నీది కాదా? అని ప్రశ్నించారు. భాస్కర కాంప్లెక్స్‌ను పేకాట క్లబ్బుగా మార్చి పేద, మధ్య తరగతి యువత జీవితాలను నాశనం చేసిన చరిత్ర నీది కాదా? అదే కాంప్లెక్స్‌లో ఒక మంత్రిని గన్ను పెట్టి బెదిరించిన విషయం రాష్ట్ర ప్రజలందరికి తెలుసునని వ్యాఖ్యానించారు. చమురు కంపెనీలకు సంబంధించి పైప్‌లైన్‌ను కట్ చేసి నిస్సుగ్గుగా ఆయిల్‌ను దొంగతనం చేసి దాన్ని అమ్ముకుని బతికే మీరు చంద్రబాబునాయుడు గురించి మట్లాడుతారా? అని నిలదీశారు. చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే అర్హత లేదని…. ఆయన కాలి గోటికికూడా సరిపోరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.