టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. పట్టాభికి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల చొప్పున పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జైలు నుంచి బయటకు వచ్చిన పట్టాభికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.
కాగా గన్నవరంలో జరిగిన ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ తర్వాత అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పట్టాభి.
ఆయన బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
కొద్దిరోజుల క్రితం గన్నవరంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పట్టాభితోపాటు తెలుగుదేశం నేతలపై సీఐ కనకరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని సీఐ కనకారావు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద పట్టాభి సహా 13 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.