హైకోర్టు తీర్పులు చంద్రబాబుకు ముందుగానే తెలుస్తున్నాయంటూ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎంపీ నందిగం సురేష్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎవరో మాట్లాడమంటే అవగాహనలేమితో మాట్లాడుతున్నారని ఆరోపించారు వర్లరామయ్య. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై ఇతర రాష్ట్రాల వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారన్నారు.
హైకోర్టును చంద్రబాబు మేనేజ్ చేశారని బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని వర్ల తప్పుబట్టారు. ఏపీ హైకోర్టులో ఇచ్చే తీర్పులన్నీ చంద్రబాబుకు 10 నిమిషాల ముందు వస్తాయని నందిగం సురేష్ మాట్లాడటం కోర్టు ధిక్కారం కాదా అని ప్రశ్నించారు. నందిగాం సురేష్ న్యాయస్థానాలను కించపరుస్తున్నారన్నారు వర్ల రామయ్య.