కోర్ట్ కంట్రోల్‌లో ఉండి, ప్రతి శుక్రవారం కోర్ట్ మెట్లు ఎక్కే విజయసాయిరెడ్డికి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్‌కు లెటర్ రాసే అర్హత లేదని విమర్శించారు టీడీపీ నేత వర్ల రామయ్య. ఓ ముద్దాయిగా బెయిల్‌పై ఉన్న విజయసాయి… తన కేసుల విషయంలో లెటర్ రాసుకోవచ్చు కానీ, ఇతరుల విషయాలలో తలదూర్చకూడదని స్పష్టంచేశారు. బెయిల్ క్యాన్సిల్ అయితే… ఎదో ఒకరోజు జైలుకు వెళ్లాల్సిన విజయసాయి రవిప్రకాశ్‌లాంటి వారిపై లేఖ రాయకూడదని కుండబద్దలు కొట్టారు.