కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ చేసిన వ్యాఖ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందిస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. జగన్ వ్యాఖ్యలకు ప్రపంచమంతా నవ్వుతోందని సీఎం కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎస్ఈసీ రమేష్‌కుమార్‌ని కులం పేరుతో దూషిస్తారా..అంటూ మండిపడ్డారు.
కరోనాపై దేశమంతా అలెర్ట్ అయింది కానీ.. సీఎం మొద్దు నిద్ర వీడకుండా ఎన్నికలు జరగాలి అంటూ పట్టుబడుతున్నారు. గతంలో పులివెందులలో మాత్రమే దాడులు జరిగేవి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రమంతా అరాచకాలు చేస్తున్నారని వర్ల రామయ్య విమర్శించారు. కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నాని ఆరోపించారు. జగనన్నకి గిఫ్ట్ ఇస్తామని సీఐ స్థాయి అధికారులు బహిరంగంగా ప్రకటించారని వర్ల రామయ్య తెలిపారు.