రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలలో పాల్గొనకుండా ప్రతిపక్ష నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎంపీ కేశినేని నాని, బోండా ఉమని, బుద్దా వెంకన్న ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నివాసం నుంచి ఎటు పోకుండా గృహ నిర్బంధం చేశారు. మరో వైపు రాజధాని అమరావతిలోని కొనసాగించాలంటూ రైతులు రోజురోజుకు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలపై మండిపడుతున్నారు. రాజధాని ఇక్కడ నుంచి కదిలే ప్రశక్తే లేదని చెప్తున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా విపక్షాలు నిలుస్తున్నాయి.
Advertisements