కెంబూరు వెంకటేశ్వరావు
టీడీపీ నేత
వైసీపి ప్రభుత్వం వయస్సు ఏడాది…
పోలవరం గురించి సోమవారం నాడు మాట్లాడకుండా మంగళవారం కబుర్లు చెబుతున్నారు.
హోదా ఊసు లేదు..హోదా బాసు పత్తాలేడు..
అమరావతిని భ్రమరావతి చేయటానికి విశ్వప్రయత్నం జరుగుతుంది..
తిరుమల తిరుపతి …కలియుగ వైకుంఠం..దర్శనం కి ఎంత ప్రాముఖ్యత ఉందో..లడ్డూ ప్రసాదానికి అంత విశిష్టత ఉంది..ఇక దర్శనంతో పనిలేకుండా మిఠాయి అంగడిలో దొరకబోతుంది.
తరిమి తరిమి కొడుతున్నా..చెప్పుతీసుకుని కొట్టేసినా…గణగణ మోగే పళ్ళెం గరిట చప్పుళ్ళు వినపడటం లేదు..
ఫ్రంట్ లైన్ విశ్లేషకులు…తెలకపల్లి..ఆ డ్రీములు..ఈ డ్రీములు..వెబ్ సైట్లు…తటస్ద ముసుగులు..సోషల్ మీడియా పేజీలు…కత్తులు..సానులు..శ్రీలు..ఇంకా బోల్డంత మంది బుక్కాఫకీర్లు..
ఐదేళ్ళు ఆడుతూ పాడుతూ ఆనందంగా వసంత మాడారు.
పట్టిసీమ ..ఇసుక..ఇన్ సైడర్ ట్రేడింగ్ ..కులగజ్జి..అన్నకేంటీన్లు…
అన్నిటి మీద బురద చల్లారు..విషం కక్కారు…
సంవత్సరం గడిచింది…వీళ్ళంతా ఎక్కడ ?
చంద్రబాబు..ఐవైయ్యార్ కి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చారు…
ముద్రగడ ఎంత విసిగించినా ..రైలు తగలబెట్టించినా సంయమనం పాటించారు..
మురికి మేధావి చలసాని కి కూడా చంద్రబాబు జతలో ఉద్యమం చేసే అవకాశం లభించింది.
ఉండవల్లి తుంపర సేద్యానికి.. అసత్య ప్రచారాలకు..కినుక వహించకుండా సమాధానం అన్నా చెప్పారు లేదా మౌనంగా ఉన్నారు.
దేవదేవుని సన్నిధిలో తరించిన వారు..స్వార్దంతో అక్కసుతో దేవస్దానాన్ని కూడా కుళ్ళు రాజకీయాల్లోకి లాగారు..పాపభీతి తో చంద్రబాబు దేవుని మొఖం చూసి వదిలేసారు.
ఇక జనానికి.. ఐదేళ్ళ స్వర్గం ముగిసింది…
గతంలో ..రెండువేల నాలుగులో ..రెండువేల తొమ్మిదిలో చేసిన పాపానికి ..
నరకం మొదలయింది..ఒక్కసంవత్సరమే గడిచింది..
ఇంకా లెక్క ప్రకారమైతే నాలుగేళ్ళు తప్పదు..
అభివృద్ది..సంక్షేమం…సుపరిపాలన…లేకపోవటమే కాదు…బోనస్ గా…స్వేఛ్చ ..వాక్స్వాతంత్ర్యం..రద్దు చేయ బడింది..నిర్భంధం…నిరంకుశం అమలుచేయబడుతున్నది….
భూములు లాక్కుంటారు..ఆస్తులు అమ్ముకుంటారు..
రద్దులు చేస్తారు…హద్దులు దాటుతారు..
నోరెత్తితే ముడ్డి పగలకొడతారు..
చంద్రబాబు కి అడుగడుగునా పల్లేరు కాయల్లా అడ్డుపడిన వారు …అర్దరాత్రి నీడలు చూసి మొరిగే ఊరుకుక్కలు…
ఇప్పుడు దొంగలు ఎదురుగా కనిపిస్తున్నా మొరగటం లేదు…కనీసం కుయ్ మని కూడా అనటం లేదు.
మీ మేధావి తనం ముండమొయ్యా!
పాడికుండను పగలగొట్టారు కదరా!
ఏం సాధించారు…?
అడుగడుగునా అవమానం..అన్యాయం..వెనుకబాటుతనం..దేశంలో ఎక్కడుండేవారిని ఎక్కడకు తీసుకు వచ్చారు…ప్రతిష్ట మొత్తం మసకబారింది..
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు చేసిన ద్రోహం చరిత్ర మరువదు.
మీరు ఎవరినైతే ద్వేషించారో…ఎవరి మీదైతే కులముద్ర వేసారో..ఎవరిని అధికారానికి దూరం చేసామనుకుంటున్నారో…
అతనికి అంతులేని మేలు చేసారు..
అతని విలువ ప్రజలకు తెలియచేసారు..
అతనికి విశ్రాంతి నిచ్చారు..మరింత పుంజుకునేటందుకు…
అతనికి అతని సైన్యం గురించి పట్టించుకునే అవకాశం ఇచ్చారు..
ఒక్క ఏడాదికే ఇలా ఉంటే..ఇదే రీతిలో సాగితే..
ఆయన ఇంట్లో కూర్చుంటే…
మీరే బతిమాలి ఆయన్ని తెచ్చుకునే రోజు వస్తుంది.