తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు మండిపడుతున్నాయి. కిలో ఉల్లి రేటు ఆకాశాన్ని తాకింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత లు నిరసనకు దిగారు.
సచివాలయం ఫైర్ స్టేషన్ వద్ద చంద్రబాబు అధ్యక్షతన తెదేపా నేతల నిరసన దిగారు. ఉల్లిపాయలతో దండలు మెడలో వేసుకుని నిరసన తెలిపారు. తక్కెడలో బంగారం, ఉల్లిపాయలు పెట్టి రెండూ సమానమేనని చూపుతూ నిరసన తెలిపారు చంద్రబాబు.
రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయన్నారు. ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోంది. తెదేపా హయాంలో నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు టీడీపీ ప్రభుత్వం తీసుకుంది. ధరలు దిగి వచ్చేవరకు మా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు చంద్రబాబు. ప్లకార్డులతో అసెంబ్లీ లోపలికి అనుమతి లేదని చంద్రబాబును గేటు వద్దనే పోలీసులు ఆపేశారు. చంద్రబాబుతో పాటు ఇతర నేతలను గేటు వద్ద ఆపేయటంతో పోలీసులకు నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉల్లి ధర సెగలతో ప్రారంభమయ్యాయి.