మాజీ మంత్రి మాగంటి బాబుకు పుత్ర శోకం కలిగింది. ఆయన పెద్ద కుమారుడు రాంజీ చనిపోయారు. కొద్ది రోజులుగా రాంజీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏలూరు, విజయవాడ ఆంధ్రా ఆస్పత్రుల్లో కొంతకాలంగా ఆయనకు చికిత్స కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాంజీ చనిపోయారు.
రాంజీ టీడీపీలో యాక్టివ్‌గా పనిచేసేవారు. తండ్రి మాగంటి బాబుకు పార్టీ కార్యక్రమాల్లో సాయపడేవారు.. రాంజీ మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. ఇవాళ ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.