చంద్రబాబు నాయుడు ముసలివాడు అయ్యాడంటూ బొత్స సత్యన్నారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూరం రేపుతున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చం నాయుడు బొత్స వ్యాఖ్యపై స్పందించారు. మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు ముసలివారయ్యారని మంత్రి బొత్సగారూ అంటున్నారు. నేను సవాల్ విసురుతున్నాను. చందరబాబు గారిని తో తిరుపతి కొండ బొత్స గారు కూడా ఎక్కాలి. ఇద్దరి లో ఎవరు ముందు ఎక్కితే వాళ్ళు యువకులని, లెక్కలేని వాళ్ళు ముసలి వాళ్ళని ప్రెస్ మీట్ చెప్పాలంటూ సవాల్ చేశారు. ఈ పోటీ కి మంత్రి బొత్స సిద్ధం అయితే చెప్పాలని ప్రశ్నించారు.
మరో వైపు చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో రెండువేల కోట్లు దొరికాయని ప్రచారం చేసిన వైసీపీ నేతలు పంచనామా చూసాక తలకాయ ఎక్కడ పెట్టుకుంటారంటూ మంత్రి బుగ్గనను ప్రశ్నించారు. హైలీ రెస్పెక్టెడ్ విజయసాయిరెడ్డి, మీరు రాయించింది, చెప్పింది అబద్ధమని మరోసారి తేలింది.క్విడ్ ప్రో క్వో, మీరు కొట్టేసిన 43 వేల కోట్ల నుంచి 2 వేల కోట్లు పంపితే వృద్ధులకు మీరు ఎత్తేసిన పింఛన్లను మేము చెల్లిస్తాం” అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.