శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇంకా టెన్షన్ కొనసాగుతోంది. పలాసలోని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామన్న మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ ఆందోళనకు సిద్ధం కావడం ఉద్రిక్తతకు దారి తీసింది. గౌతు లచ్చన్న విగ్రహం వద్ద నిరసనకు బయల్దేరిన టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వబోమని వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే ఎలాగైనా నిరసన కార్యక్రమం నిర్వహించి తీరుతామని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కూడా హౌస్ అరెస్టు చేశారు. అయినప్పటికీ.. పలాస బయల్దేరడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు.
నిమ్మాడలో అచ్చెనాయుడితో పాటు… శ్రీకాకుళంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కూన రవికుమార్, సోంపేటలో మాజీ మంత్రి గౌతు శివాజీ, పలాసలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషను పోలీసుల హౌస్ అరెస్ట్ చేశారు.