స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను సుప్రీంకోర్టు సమర్ధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ఇప్పుడు జడ్జిలకు కూడా కులం ఆపాదిస్తాడేమోనని భయంగా ఉందంటూ సెటైర్లు విసిరారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కులాన్ని ఆపాదించిన జగన్ ఇప్పుడు ఎవరికి ఆపాదిస్తారో భయంగా ఉందంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్నికల కోడ్ ను సడలించడాన్ని కూడా టీడీపీ పార్టీ స్వాగతిస్తుంది.
కొత్త పథకాలు వద్దని సుప్రీంకోర్టే చెప్పింది. దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. విదేశాల్లో ఉండే ఆంధ్రులు విమానాశ్రయాల్లో విలపిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం అవేవి పట్టట్లేదని విమర్శించారు.