ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను గుంటూరు టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి భేటీ అయిన సంగతి తెలిసిందే. జగన్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన గిరి తన నియోజక వర్గ అభివృద్ధి కోసమే జగన్ ను కలిశానని, ప్రస్తుతం నియోజక వర్గంలో ఉన్న పరిస్థితులను వివరించానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కి వెంటనే 25 కోట్ల రూపాయలు విడుదల చెయ్యాలని జగన్ ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి జగన్ కార్యదక్షత ఉన్న నాయకుడని, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఇంగ్లీష్ మీడియం విషయంలో చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంబించారని, ఆయన మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. చంద్రబాబు హయంలో గుంటూరు ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని చెప్పుకొచ్చారు గిరి.